‘జనరల్ బోగీలు’కు బహుమతుల పంట
తెనాలి: ‘జనరల్ బోగీలు’ నాటిక ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి పరిషత్ పోటీల్లో పలు బహుమతులను కై వసం చేసుకుంది. రూరల్ మండల గ్రామం కొలకలూరుకు చెందిన ప్రముఖ నాటక సమాజం శ్రీసాయి ఆర్ట్స్ వారు దీనిని ప్రదర్శించారు. బాపట్ల జిల్లా చిలకలూరిపేటకు దగ్గర్లోని అనంతవరంలో ఇటీవల జరిగిన ఎన్టీఆర్ కళాపరిషత్ నాటికల పోటీల్లో ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. ఇందులో ప్రధాన పాత్రధారిణి సురభి ప్రభావతికి ఉత్తమ నటి, సీఐ పాత్రలో నటించిన గోపరాజు విజయ్, కానిస్టేబుల్ పాత్రను పోషించిన కె.నాగేశ్వరరావుకు ఉత్తమ సహాయనటుడు బహుమతులు వచ్చాయి. ఉత్తమ రచనకుగాను పీటీ మాధవ్‌కు బహుమతి వచ్చింది. రైలులో జనరల్ బోగీలు ప్రమాదానికి గురైతే సాధారణ ప్రయాణికులు, వారి కుటుంబాలు పడే ఇబ్బందులే ఇతివృత్తంగా రూపొందిన ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment