లక్ష్మీపురం: విజయవాడ – చైన్నె జాతీయ హైవే సమీపంలోని బుడంపాడు వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ తన బిడ్డ సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడంపాడు వద్ద రైలు పట్టాలపై ఓ మహిళ, పసి బిడ్డ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చింది.
ఎస్సై లక్ష్మీనారాయణరెడ్డి సిబ్బందితో చేరుకున్నారు. వారి వివరాలు తెలియరాలేదు. మృతదేహాలను ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు గుంటూరు జీఆర్పీ ఎస్సైని 83280 18787, పోలీస్ స్టేషన్‌ను 0863–222073 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment