కృష్ణానదిలో యువకుడు గల్లంతు
తాడేపల్లి రూరల్ : కృష్ణానది నీటిలో ఓ యువకుడు ఆదివారం గల్లంతయ్యాడు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా భీమునిపట్నం, నేరెళ్లవలసకు చెందిన చాట్ల బాలు (18) కుటుంబం విజయవాడకు వచ్చి కూలీ పనులు చేసుకుంటోంది. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో ఈతకని వచ్చి నీటిలోకి దిగారు. బాలు మునిగిపోవడంతో స్నేహితులు కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వెతికినా ప్రయోజనం కనిపించలేదు. తాడేపల్లి పోలీసులు, మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అతడి బంధువులు, స్నేహితులు నది వద్దకు వచ్చి బాలు ఆచూకీ కోసం ఎదురు చూశారు.
Comments
Please login to add a commentAdd a comment