యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఈ ఏడాది ఏప్రిల్ 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సురేష్‌బాబు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య పేరిట ప్రతి సంవత్సరం యడ్లపాడులో పండగ వాతావరణంలో నిర్వహించడం దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తుందన్నారు. ఏప్రిల్ మాసంలో నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నామన్నారు. పోటీల నిర్వహణ ప్రతిసారీ విభిన్న తరహాలో నిర్వహించాలనే సంకల్పంతో కమిటీ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే నాటికల స్కూట్నీలు చేసి ఉత్తమోత్తమ వాటిని తమ వేదికపై ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థ కార్యదర్శి ముత్తవరపు రామారావు, పోపూరి నాగేశ్వరరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment