![బిల్ల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/currentmeterfffinal_mr-1738785974-0.jpg.webp?itok=ydXcJBSE)
బిల్లు చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే!
పొన్నూరు: విద్యుత్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. పొన్నూరు పట్టణంలోని ముబారక్‌నగర్‌కు చెందిన ఓ హోటల్ (సర్వీసు నెంబర్ 1722100014916)కు ఈ నెల 3వ తేదీన రూ. 61,478 బిల్లు రావడంతో నిర్వాహకులు కంగుతిన్నారు. ప్రతి నెలా రూ. 20 వేలకు మించి రాని బిల్లు ఒకేసారి మూడింతలు పెరిగడంతో లబోదిబోమంటున్నారు. డిసెంబరు నెల 4వ తేదీన పాత మీటరు ఉన్నపుడు రూ.17,821 బిల్లు వచ్చినట్లు విద్యుత్ అధికారులు డిమాండ్ నోటీసు అందించారు. అదే నెలలో ఆ హోటల్‌కు స్మార్ట్ మీటర్ బిగించారు. ఈ నెల బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చిందని చూస్తే 5495 యూనిట్ల వినియోగానికి రూ. 61,478 వేలు వేశారు. వాటిలో ఎనర్జీ చార్జీ రూ. 55,081, ఫిక్స్‌డ్ చార్జీ రూ.825, కస్టమర్ చార్జీ రూ. 45, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1330, సర్‌చార్జ్ రూ. 345, ఎఫ్‌పీపీసీఏ (2022–05) కింద రూ.1,077, ఎఫ్‌పీపీసీఏ (2023–04) కింద రూ.857, ఎఫ్‌పీపీసీఏ (2024–12) కింద రూ.1,904లు ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై హోటల్ నిర్వాహకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. బిల్లు చెల్లించాల్సిందేనని వారు తేల్చిచెప్పారని బాధితుడు వాపోయారు. దీనిపై పొన్నూరు ఏఈ వెంకయ్య మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు ఉపయోగించే వ్యాపారులు మోటార్లు, కెపాసిటర్లకు ఆన్ –ఆఫ్ స్విచ్చులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిషన్లు అలాగే ఉంచితే రీడింగ్ నమోదు అవుతూనే ఉంటుందని చెప్పారు. అధిక బిల్లు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కూటమి ‘స్మార్ట్’ దెబ్బకు మూడింతలు అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లు పాత మీటరులో ఓ హోటల్‌కు నవంబరులో బిల్లు మొత్తం రూ. 17,821 స్మార్ట్ మీటరు బిగించాక ఫిబ్రవరి బిల్లు ఏకంగా రూ. 61,478
![బిల్లు చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే! 1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05gea101-150111_mr-1738785974-1.jpg)
బిల్లు చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment