పంచాయతీ సిబ్బందికి శిక్షణ
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌లో బుధవారం ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 20 ఉత్తమ పంచాయతీల కార్యదర్శులు, క్లాప్‌మిత్రలు, పారిశుద్ధ్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీపీవో బి.వి. నాగసాయికుమార్ ఒక ఈవోపీఆర్డీని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లు నిర్వహణ, వర్మీకంపోస్టుపై మాట్లాడమని సూచించారు. దీంతో దుగ్గిరాల మండలం ఈవోపీఆర్డీ జవహర్‌లాల్ నెహ్రూ ముందుకు వచ్చారు. వివిధ విధుల నిర్వహణలో సెక్రటరీలకు మినహాయింపు ఇచ్చేలా ఎంపీడీవోలకు సూచించాలని కోరారు. డీపీవోగా తనకు కలెక్టర్ వద్ద నాలుగు మీటింగులు ఉంటాయని, అయినా డ్యూటీ వదిలేస్తానా అని నెహ్రూని డీపీవో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాను టైం టు టైం చెక్ చేయడం స్టార్ట్ చేస్తే గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నారో తెలిసిపోతుందన్నారు. సిస్టమ్ గురించి తనకు చెప్పొద్దని హెచ్చరించారు. అనంతరం డీపీఆర్సీ డీసీ పద్మారాణి మాట్లాడుతూ చెత్త నుంచి సంపద ఎలా సృష్టించుకోవాలి, తడి – పొడి చెత్తలను వేరు చేయడంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో తెనాలి డీఎల్‌పీవో స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment