కూటమి రాక్షసత్వాన్ని ప్రజలు గుర్తించాలి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ఇటీవల జరిగిన జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కొందరు రాజకీయం చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం అంబటి మాట్లాడుతూ... స్టాండింగ్ కమిటీ ఎన్నికల వేళ 56 మంది కార్పొరేటర్లలో 33 మంది తమ వారేనని అన్నారు. అందులో ఒకరు స్వతంత్ర, 32 మంది పార్టీ గుర్తుపై గెలిచారని చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం నుంచి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు బెదిరింపుల పర్వం మొదలైందని ఆరోపించారు. కార్పొరేటర్లకు పార్టీ కండువాలేయడం, డబ్బులు ముట్టజెప్పడం మాములైందని మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యేలు తీవ్ర ప్రలోబాలకు గురిచేశారని ధ్వజమెత్తారు. మా పార్టీ తరఫున నలుగురు కార్పొరేటర్లు క్రాస్ ఓట్లేయడం బాధించిందని అన్నారు. త్వరలో మేయర్, డిప్యూటీ మేయర్, మిగిలిన కార్పొరేటర్లు ఇక ఉండరనే కూటమి రాక్షసత్వాన్ని నగర ప్రజలు గమనించాలని కోరారు. వీరిపై అవిశ్వాస తీర్మానం చేసినా చెల్లదని, ఐదేళ్లపాటు మేయర్, డిప్యూటీ మేయర్ కొనసాగుతారని స్పష్టం చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనేక ప్రలోబాలకు గురి చేసినా 24 మంది తమ పార్టీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. జీఎంసీ కమిషనర్ బుడమేరు వరదల సమయంలో రూ.9.24 కోట్లు కాజేశారని ఆరోపించారు.
● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రలోబాలకు గురి చేశారనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. పార్టీలో ఇష్టం లేని వారు బయటకు వెళ్లొచ్చని చెప్పారు.
● మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ గొప్ప విజయం సాధించినట్లుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పదవుల కోసం కక్కుర్తి పడబోమని, గత నాలుగేళ్లలో అభివృద్ధి చేశామన్నారు. ఇవేమీ తెలియకుండా మాట్లాడటం సరికాదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులుకు హితవు పలికారు.
● డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు మాట్లాడుతూ.. లోపాయికారి ఒప్పందాలతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కొందరు ఓట్లేశారని ఆరోపించారు. అధికారం కోసం పాకులాడేది టీడీపీ అని, ప్రజల విశ్వాసం కోసం పనిచేసే పార్టీ తమదని పేర్కొన్నారు.
● తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నూరిఫాతిమా మాట్లాడుతూ.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లకు డబ్బులు ఆశ చూపి టీడీపీ వారిని గెలిపించుకునేందుకు నానా కష్టాలు పడ్డారని మండిపడ్డారు.
● మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. గుంటూరు ప్రజలను కూటమి నేతలు ఓడించారని ఆరోపించారు. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ మండిపడ్డారు. గతంలో కమిషనర్‌గా పనిచేసిన కీర్తి చేకూరిపై ఆరోపణలు లేవని గుర్తుచేశారు. రిటైర్డు అయినా పిలిచేలా చేస్తున్నారని కమిషనర్‌పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. కమిషనర్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అడుగుతారని, ఆయన కోసం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సాయం చేస్తారని ఆరోపించారు. మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్ గోపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కూటమి తాయిలాలు కీలకంగా వ్యవహరించిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యేలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్ల క్రాస్ ఓటింగ్ అనైతికం ఐదేళ్లపాటు మేయర్‌గా కావటి, డిప్యూటీ మేయర్‌గా బాలవజ్రబాబు నిధుల దుర్వినియోగంపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment