![పశువుల రక్షణకు రేడియం స్టిక్కర్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06tdk81-150117_mr-1738871111-0.jpg.webp?itok=Hh555XzH)
పశువుల రక్షణకు రేడియం స్టిక్కర్లు
వెంకటపాలెం (తాడికొండ): రోడ్డుపై సంచరించే సమయంలో పశువులకు ప్రమాదం జరగకుండా రేడియం స్టిక్కర్లు తప్పనిసరి అని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బబిత అన్నారు. గురువారం రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో పశువులకు రేడియం స్టిక్కర్లు, ట్యాగ్‌లు వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో తరచూ పశువులను వాహనాలు ఢీకొంటున్న ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూగజీవాలను కాపాడేందుకు అందరూ ఇలా పశువులకు స్టిక్లర్లు వేయించాలని కోరారు. ఉప కార్యదర్శి అమర లింగేశ్వరరావు, డీఎస్పీ మురళీ కృష్ణ, సీఐలు గంగా వెంకటేశ్వర్లు, బి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment