![బాలకోటయ్య తిరునాళ్ల జయప్రదానికి కృషి చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rpl108-150150_mr-1738871112-0.jpg.webp?itok=6KDGZDnR)
బాలకోటయ్య తిరునాళ్ల జయప్రదానికి కృషి చేయాలి
రేపల్లె రూరల్: మహాశివరాత్రి సందర్భంగా అవరపల్లి బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లను జయప్రదం చేయాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉప కమిషనర్ కేబీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అరవపల్లి గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి ఆలయాన్ని గురువారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరునాళ్ళకు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సమన్వయంతో పనిచేసి వసతులు కల్పించాలని సూచించారు. స్వామి దర్శనానికి అవసరమైన బారీకేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పొంగళ్లు పొంగించేందుకు, తలనీలాల సమర్పణకు వసతులు కల్పించాలన్నారు. ప్రభలను భక్తులు తీసుకువచ్చే సమయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీసులను కోరారు. పకడ్బందీ బందోబస్తు పెట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్, ప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆయన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణాధికారి దివి వెంకట అప్పలాచార్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
దేవదాయ, ధర్మదాయశాఖ
ఉప కమిషనర్ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment