![ఏషియన్ గేమ్స్ షూటింగ్ బాల్ పోటీల్లో బాలికకు బంగారు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06bpt51r-150094_mr-1738871114-0.jpg.webp?itok=kSzelqxd)
ఏషియన్ గేమ్స్ షూటింగ్ బాల్ పోటీల్లో బాలికకు బంగారు
కర్లపాలెం: అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనూరాధరెడ్డి బంగారు పతకం సాధించింది. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ చదువుతున్న అనూరాధరెడ్డి కళాశాల తరపున ఆంధ్రా నుంచి ఏషియన్ గేమ్స్‌లో బాలికల విభాగంలో షూటింగ్ బాల్ పోటీలలో 12 మంది సభ్యులు ఉండే ఇండియా జట్టు తరఫున పాల్గొంది. ఫిబ్రవరి 2, 3వ తేదీలలో నేపాల్‌లోని ఇటిహార్ జిల్లాలో జరిగిన షూటింగ్ బాల్ పోటీలలో ఇండియా టీమ్, నేపాల్ టీమ్‌పై ఆడి ఫైనల్స్‌లో విజయం సాధించి బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ఇండియా టీమ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొని మెరుగైన ప్రతిభ కనబరిచిన అనూరాధరెడ్డి నేపాల్ ప్రధానమంత్రి మాధవ్‌కుమార్ చేతుల మీదుగా బంగారు పతకం, మెమోంటో అందుకుని గురువారం స్వస్ధలానికి చేరుకుంది. అనంతరం కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న స్ధానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజును అనూరాధరెడ్డి తన తల్లిదండ్రులు పిట్టు సుబ్బారెడ్డి, నాగలక్ష్మిలతోపాటు కలిసింది. ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు అనూరాధరెడ్డికి పూలమాలవేసి శాలువాకప్పి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment