![చోరీ కేసులో ఇద్దరి అరెస్టు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rpl106-150150_mr-1738871113-0.jpg.webp?itok=_UPL8g8h)
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
రేపల్లె రూరల్: చోరీ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా క్రైమ్ డీఎస్పీ జగదీష్‌నాయక్ చెప్పారు. పట్టణ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిందితుల వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్ 17న జగనన్న కాలనీలోని జగదీశ్వరరావు గృహంలో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడింది నిజాంపట్నానికి చెందిన బాలుడిగా గుర్తించారు. అతడు రేపల్లె పరిసర ప్రాంతాలతోపాటు తెనాలి, విజయవాడ, బాపట్ల ప్రాంతాలలో చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. పగటి వేళల్లో తాళాలు వేసి ఉన్న గృహాలను పరిశీలించి రాత్రుళ్లు బాలుడు చోరీలకు పాల్పడుతుంటాడని తేలింది. అపహరించిన బంగారు నగలను నిజాంపట్నం మండలం మిరియాలవారిపాలెంకు చెందిన నూతన్‌బాబుకు అందించేవాడు. నూతన్‌బాబు ఆభరణాలను ముక్కముక్కలుగా చేసి అమ్మేవాడు. విశ్వసనీయ సమాచారంతో చెరుకుపల్లిలో ఉన్న బాలుడిని అరెస్టు చేసి ఆ తర్వాత బాలుడు ఇచ్చిన సమాచారంతో నూనత్‌బాబును తెనాలిలో అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.1.5లక్షల నగదు, 80 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న బాలుడు రూ.1.50ల నగదుతోపాటు 80 గ్రాముల బంగారం స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment