పున్నమ్మ మృతదేహానికి పంచనామా
పిడుగురాళ్ల: గతేడాది మృతి చెందిన మారం పున్నమ్మ మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం చేసిన సంఘటన గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని బెల్లంకొండ డొంకలోని పొలంలో జరిగింది. పట్టణ ఎస్‌ఐ మోహన్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మారం పున్నమ్మ (84) 2024 ఆగస్టు 5న మృతి చెందింది. మృతురాలి కుమారుడు రమణారెడ్డి ఫిర్యాదు మేరకు రీ పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. లక్ష్మీనారాణయమ్మ చంపి ఉంటుందని అనుమానంతో రమణారెడ్డి కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు పున్నమ్మ మృతదేహాన్ని వెలికి తీసి రీ పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ మధుబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment