గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Published Fri, Feb 7 2025 1:31 AM | Last Updated on Fri, Feb 7 2025 1:32 AM

గుంటూ

గుంటూరు

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

I

లక్ష్మీ నారసింహుడికి పూజలు

ఫిరంగిపురం: నుదురుపాడులోని లక్ష్మీనారసింహ స్వామికి గురువారం విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఏటా పెళ్లికాని యువతీయువకుల తల్లిదండ్రుల నుంచి అర్చకులు, ఫొటోగ్రాఫర్‌లు.. మండపాల డెకరేషన్‌ వారు.. వంటవారు.. లైట్‌ మెన్‌.. మంగళ వాయిద్యకారులు... ఇలా ఒకరేమిటి మాఘ ఘడియల కోసం ఎదురు చూసే వారెందరో. ఏటా మాఘ మాసం మంచి ముహూర్తాలు మోసుకొని వస్తుంది. ఈ సారి కూడా శుభగడియలు తెచ్చింది. దీంతో శుభకార్యాల సీజన్‌ మొదలైంది. ఊరూ వాడా సందడి కనిపిస్తోంది. పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, పెద్దల దీవెనలతో జంటలు ఒక్కటవుతున్నాయి. అంతేకాదు గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, విశిష్ట హోమ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి.

పట్నంబజారు/గుంటూరు ఈస్ట్‌/తాడేపల్లి రూరల్‌: శుభ కార్యాలకు ముందుగా గుర్తొచ్చేది మాఘ మాసమే. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మొదటగా వచ్చే శుభం కలిగే మాసంగా దీనిని పండితులు పరిగణిస్తారు. గత వారం నుంచి మాఘ మాసం ప్రారంభం కాగా వివాహాది శుభ కార్యక్రమాల సందడి మొదలైంది. ఇప్పటికే రెండు, మూడు నెలల ముందు నుంచి సంబంధాలు కుదుర్చుకున్న జంటల తల్లిదండ్రులు.. మాఘ మాసం రావడంతో పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో రాబోయే రోజులన్నీ బాజాభజంత్రీలతో మారుమోగనున్నాయి. ఒక్క వివాహాలే కాకుండా, గృహ నిర్మాణాల ప్రారంభం, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, ఆడబిడ్డలకు ఒడి బియ్యం పోయటం, నిశ్చితార్థం, విశిష్ట హోమాలు, ఆలయ ప్రతిష్టలు తదితర కార్యాలకు వరుసగా 40 రోజుల వరకు ముహూర్తాలు ఉన్నాయని వేదపండితులు, పురోహితులు చెబుతున్నారు.

మండపాలకు డిమాండ్‌

రెండు, మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు రావడంతో కల్యాణ మండపాలకు డిమాండ్‌ పెరిగింది. చాలా మంది ఇప్పటికే కల్యాణ మంటపాలు బుక్‌ చేసుకున్నారు. మంటపాలు దొరకని వారు తమ ఇళ్ల వద్దే వివాహాలు జరుపుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది వారికి ఉన్న మొక్కును బట్టి ఆలయాల్లో చేసుకుంటున్నారు. వివిధ రకాల శుభ కార్యక్రమాల సమయం ఆసన్నం కావడంతో వివిధ రకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా పట్టువస్త్రాలు. బంగారు, అలంకరణ వస్తువులు, పూల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.

డ్రోన్‌ ఫొటోగ్రఫీకి గిరాకీ

గగనతలం నుంచి అత్యంత క్వాలిటీతో ఫొటోలు, వీడియోలు తీయడం డ్రోన్‌ ఫొటోగ్రఫీ విశిష్టత. దీంతో దీనికి ఆదరణ పెరిగింది. డ్రోన్‌తో తీసేందుకు ఒక్కో కార్యక్రమానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ తీసుకుంటున్నారు.

పలువురికి ఉపాధి

శుభకార్యాలు ప్రారంభం కావడంతో ప్రధానంగా పురోహితులు, షామియానా, సెట్టింగ్లు, బ్యాండ్‌ వాయిద్య కళాకారులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్స్‌, ఆర్కెస్ట్రా, క్యాటరింగ్‌, బ్యూటీ పార్లర్‌ నిర్వహకులు, ట్రావెల్స్‌ ఏజెన్సీలు, కళ్యాణ మండపాల డెకరేషన్‌ కార్మికులకు డిమాండ్‌ ఏర్పడింది. అందువల్ల ఆయా వ్యాపార వర్గాల వారికి చేతినిండా పని లభిస్తోంది. శుభకార్యాలు వారి ఉపాధికి దోహద పడుతున్నాయి. వివాహం రెండు రోజుల కార్యక్రమం. వధూవరులను సిద్ధం చేయడం దగ్గర నుంచి పెళ్లయి మళ్లీ వారిని ఇంటికి తీసుకొచ్చే వరకూ మంగళ వాయిద్యాలు అవసరం ఉంటుంది. ట్యాండ్‌ మేళం వారు ఒక్కో కార్యక్రమానికి రూ.25 వేల నుంచి నుండి రూ.30 వేలకుపైగానే తీసుకుంటున్నారు. ఇతరత్రా ఆర్కెస్ట్రా, సంగీత విభావరిలు రూ.లక్షల్లోనే ఉన్నాయి మరీ.

విందుపై ప్రత్యేక దృష్టి

విందు లేనిదే పెళ్లి ఉండదు. దీనికి చాలా మంది అధిక ప్రాధాన్యం ఇస్తారు. భోజనాలు రుచిగా, శుచిగా ఉండాలని కోరుకుంటారు. బంధుమిత్రుల్లో మాటరాకూడదని భావిస్తారు. అందుకే ఎంత ఖర్చు అయినా వెనుకాడరు. ఉదయం టిఫిన్‌ నుంచి రాత్రి భోజనం వరకు.. పెళ్లి అయిపోయే వరకు సరఫరా చేసే క్యాటరింగ్‌ సంస్థలు చాలానే ఉన్నాయి. మెనూ ప్రకారం ఎంచుకున్న పదార్థాలను బట్టి ధర నిర్ణయిస్తారు. ఈ మాసంలో పండుగలు కూడా అధికంగానే ఉంటాయి. 8న భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం, లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, 26న మహాశివరాత్రి వంటి పర్వదినాలు ఉన్నాయి.

పసిడి, పూల ధరలు ౖపైపెకి..

మార్కెట్లో బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కడా ఇంత వరకు ఒక చోట స్థిరంగా నిలిచింది లేదు. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో వివిధ వస్తువులు, పూల ధరలు కూడా అమాంతం పెరిగాయి.

ఈ సీజన్‌లో

ఇదే ప్రథమం

కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు గురువారం భారీ స్థాయిలో ఈ సీజన్‌లో ప్రథమంగా 1,36,176 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,33,436 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.17,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ధర లభించింది. ఏసీ కామన్‌ రకం రూ.9,500 నుంచి రూ.13,200 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 74,902 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

ఓ పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసిన పూల పందిరి

ముహూర్త తేదీలు ఇవీ...

న్యూస్‌రీల్‌

40 రోజుల వరకు శుభకార్యాలు

వివాహాలు, గృహ ప్రవేశాల సందడి

పలు రంగాల వారికి పెరిగిన ఉపాధి

యార్డుకు 1,36,176 బస్తాల మిర్చి

మొత్తం 1,33,436 బస్తాల అమ్మకం

ఫిబ్రవరి నెలలో 7, 13, 14, 15, 18, 19, 20, 21, 28, 25వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. 7, 15, 18, 20, 22వ తేదీల్లో మరింత బలమైనవని ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మార్చిలో 8 రోజులు, ఏప్రిల్‌ నెలలో 12 రోజులు, మే నెలలో 10 రోజులు వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయన ముహూర్తాలు మంచిగా ఉన్నాయని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. వరుస శుభకార్యక్రమాల తాకిడితో పురోహితులకు బాగా డిమాండ్‌ పెరిగిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
గుంటూరు1
1/4

గుంటూరు

గుంటూరు2
2/4

గుంటూరు

గుంటూరు3
3/4

గుంటూరు

గుంటూరు4
4/4

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement