1.12 లక్షల శివలింగాకృతి ప్రతిమలు అందజేత
హనుమాన్‌జంక్షన్ రూరల్: గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని తాళ్లాయపాలెంలో నిర్మిస్తున్న శివక్షేత్రానికి బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన భక్తులు 1.12 లక్షల శివలింగాకృతి ప్రతిమలను పంపించారు. శివాలయం నిర్మాణంలో అధిక సంఖ్యలో భక్తులను భాగస్వాములను చేసేందుకు తాళ్లాయపాలెం శివస్వామి ఆధ్వర్యంలో ఇటీవల వీరవల్లిలోని షిర్టీ సాయిబాబా సేవా సమితికి మట్టి అందించారు. దీంతో షిర్డీ సాయిబాబా సేవా సమితి భక్త బృందం నెలరోజుల పాటు శ్రమించి ఈ ప్రతిమలను తయారు చేసింది. మేళతాళాలతో ఊరేగింపుగా శివస్వామి భక్తుల ద్వారా తాళ్లాయపాలెం పంపించారు. షిర్డిసాయిబాబా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్ రూమ్
లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనికి 0863 – 2979766 ఫోన్ నెంబరు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గురువారం పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు, వివరాలకు 24 గంటలు పని చేసే కంట్రోల్ రూముకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
శని,ఆదివారాల్లో స్వీకరణకు నో చాన్స్
లక్ష్మీపురం: ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈ నెల 8వ తేదీన రెండో శనివారం, 9న ఆదివారం పబ్లిక్ హాలీ డే కావడంతో కృష్ణా , గుంటూరు ఉమ్మడి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల పత్రాలు స్వీకరింబోరని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.నాగలక్ష్మి తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిందిగా గురువారం పేర్కొన్నారు.
తెనాలిలో సదరం క్యాంప్
తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో గురువారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఈఎన్‌టీ, ఇంకా పలు విభాగ వికలాంగులకు పరీక్షలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు సేవలు అందించారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి క్యాంప్‌ను పర్యవేక్షించారు. శుక్రవారం కూడ శిబిరం కొనసాగుతుందని ఆమె చెప్పారు.
చిట్‌ఫండ్స్ యజమానికి
14 రోజుల రిమాండ్
గుంటూరు జిల్లా కారాగారానికి తరలింపు
నగరంపాలెం: నరసరావుపేట టౌన్‌లోని సాయిసాధన చిట్‌ఫండ్స్ సంస్థ యజమాని పాలడుగు పుల్లారావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అతనిపై పల్నాడు జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 43 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేయగా, మోసపోయిన జాబితాలో మరి కొంత మంది ఉన్నారు. బాధితులను సుమారు రూ.పది కోట్ల మేరకు మోసగించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వస్తున్నారని, మొత్తం ఎన్ని రూ. కోట్లనేది మరో పది రోజుల్లో తేలనుందని పేర్కొన్నారు. ఇటీవల మోసం బయట పడినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతను గురువారం జిల్లా కోర్టుకు వచ్చారు. గుంటూరు ఎకై ్సజ్ కోర్టులో హాజరైన పుల్లారావుకు 14 రోజుల రిమాండ్‌ను ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి స్పందన విధించారు. అనంతరం పుల్లారావును గుంటూరు నగరంలోని జిల్లా కారాగారానికి తరలించారు.
నేటి నుంచి జీజీహెచ్ గేటు మూసివేత
గుంటూరు మెడికల్ : జీజీహెచ్‌లోని పాత భవనం గేటు మరమ్మతుల కారణంగా శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ గురువారం తెలిపారు. రోగులు, వారి సహాయకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. డాక్టర్ పొదిలి ప్రసాద్ బ్లాక్ దగ్గర ఉన్న గేటు ద్వారా, ఓపీ వద్ద మార్గం గుండా ఆసుపత్రిలోకి ప్రవేశించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment