శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
పెదకాకాని: మహా శివరాత్రి పర్వదినం రోజున ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం సకాలంలో జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ అన్నారు. పెదకాకాని శివాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సమీక్ష సమావేశం జరిగింది. పెదకాకాని తహసీల్దార్ పి. కృష్ణకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీసీ లీలాకుమార్ మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని చెప్పారు. అన్న సంతర్పణ, ప్రసాదాల పంపిణీ ఉంటాయని తెలిపారు. చలువ పందిళ్ళు, టెంట్‌లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి స్వామివారి కళ్యాణాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించేలా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. అనంతరం వాల్‌పోస్టర్‌లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు.
23 నుంచి పెదకాకానిలో
బ్రహ్మోత్సవాల నిర్వహణకు సన్నాహాలు
దర్శనంలో సామాన్య భక్తులకు
ప్రాధాన్యమిస్తామని డీసీ వెల్లడి
వేడుకల వాల్‌పోస్టర్, ఆహ్వాన
పత్రికల ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment