![ఆసక్త](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ptp04-150121_mr-1738871193-0.jpg.webp?itok=mOrVJY_J)
ఆసక్తితో విద్యార్థులకు అంకెలు నేర్పిన కార్మికురాలు
ప్రత్తిపాడు: పారిశుద్ధ్య కార్మికురాలు ఆసక్తితో పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థులకు అంకెలు నేర్పిందని జిల్లా విద్యాశాఖాధికారి సి.వి. రేణుక తెలిపారు. ప్రత్తిపాడు ఎల్‌ఈ పాఠశాలలో ‘పారిశుద్ధ్య కార్మికురాలే పంతులమ్మ’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో సి.హెచ్. రమాదేవి పాఠశాలలో విచారణ నిర్వహించారు. హెచ్‌ఎం సదాశివరావుతో పాటు కార్మికురాలిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, వారిలో ఒకరు ఎఫ్‌ఎల్‌ఎన్ ట్రైనింగ్‌కు, మరొకరు ఇతర పాఠశాలకు పని సర్దుబాటుపై, వేరొకరు సెలవులో ఉన్నారని తెలిపారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు పాఠశాలలోనే ఉన్నారని, మరో టీచర్ మాత్రం క్లస్టర్ హెచ్‌ఎం ఆదేశాలతో పాఠశాల డెవలప్‌మెంట్ ప్లాన్ సమర్పించేందుకు వెళ్లారన్నారు. ఆ సమయంలో పూర్వ విద్యార్థి, పారిశుద్ధ్య కార్మికురాలు ఇలా పాఠాలు చెప్పారని డీఈవో కార్యాలయం వివరణలో పేర్కొంది. ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో స్కూల్ విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు.
వివరణ ఇచ్చిన జిల్లా
విద్యాశాఖాధికారి సి.వి. రేణుక
![ఆసక్తితో విద్యార్థులకు అంకెలు నేర్పిన కార్మికురాలు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/07022025-g_gnt_tab-01_subgroupimage_1885715856_mr-1738871194-1.jpg)
ఆసక్తితో విద్యార్థులకు అంకెలు నేర్పిన కార్మికురాలు
Comments
Please login to add a commentAdd a comment