![విజయకీలాద్రిపై శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mgl66-150134_mr-1738871193-0.jpg.webp?itok=QmfLfv7X)
విజయకీలాద్రిపై శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు
తాడేపల్లి రూరల్: సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గురువారం సకల విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ హోమాన్ని, హనుమద్వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయకీలాద్రి దివ్య క్షేత్ర 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8.30 గంటలకు హయగ్రీవ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను, సాయంత్రం శ్రీనివాసునికి అశ్వవాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వేదవిద్యార్థులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment