![ఖల్ నాయక్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/drug1fffffffinal_mr-1738982269-0.jpg.webp?itok=wiKWHWID)
ఖల్ నాయక్
తండ్రి ధర్మకర్త... అడ్డదారిలో కుమారుడు
● అధికార పార్టీ అండదండలు ● మస్తాన్ సాయిపై ప్రభుత్వ ఆరోపణలపై ఉదాసీనత ● ముతవల్లీ పోస్టు నుంచి తొలగించాలని సిఫార్సు చేసిన వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ ● బుట్టదాఖలు చేసిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రగ్స్, సెక్స్ రాకెట్‌లో మార్మోగుతున్న పేరు మస్తాన్ సాయి. అతను గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడైన రావి రామమోహనరావు కుమారుడు. గతంలో కూడా ఇతనిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. సినీ హీరో రాజ్ తరుణ్– లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు వెలుగుచూసింది. దర్గాకు దర్శనం కోసం వచ్చినప్పుడు తనతో మస్తాన్ సాయి అసభ్యంగా ప్రవర్తించినట్లు లావణ్య గుంటూరు పట్టాభిపురంలో ఫిర్యాదు చేసింది. అయినా ఇక్కడి పోలీసుల పట్టించుకోలేదు. ఇద్దరికీ రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఆగస్టులో విజయవాడ పోలీసులు డ్రగ్స్ సరఫరా కేసులో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అతని హార్డ్ డిస్క్‌లో పెద్దఎత్తున యువతులతో అశ్లీల వీడియోలు, వందల సంఖ్యలో ఫొటోలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ హార్డ్ డిస్క్‌ను లావణ్య తెలంగాణలోని నార్సింగి పోలీసుస్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేయడంతో మళ్లీ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. గతంలో అరెస్టు చేసినప్పుడు కేవలం డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరిపి వదిలిపెట్టేశారు. దీనికి అతని తండ్రి మస్తానయ్య దర్గా నిర్వాహకుడు కావడం, అధికార పార్టీతో మంచి సంబంధాలు ఉండటమే కారణమని సమాచారం. అతనికి సంబంధించిన అన్ని వ్యవహారాలను గతంలో గుంటూరులో ఫిర్యాదు చేసినప్పుడు లావణ్య ప్రస్తావించినా, అప్పుడు తనకున్న పలుకుబడిని ఉపయోగించి అతని తండ్రి కేసును ముందుకు వెళ్లకుండా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment