నిర్వహణ
10 నుంచి ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నీ
లక్ష్మీపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ –2025 పోటీలు జరగనున్నాయి. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయం నేతృత్వంలో తొలిసారి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు తలపడనున్నాయి. తొలిసారిగా క్రీడలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం గర్వించదగ్గ విషయం. ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్‌కు అర్హత పొందేందుకు ఇది ఉపయోగపడనుందని ఆడిట్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో వారి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందుతారు. టోర్నమెంట్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 13 మధ్యాహ్నం 1.30 గంటలకు ముగింపు వేడుకతో ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment