అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం స్వామికి అవభృదస్నానం, కృష్ణానదిలో చక్ర తీర్థం, అనంతరం ప్రోక్షణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, మహా పూర్ణాహుతి, వేదాశీర్వచనాలతో జరిపారు. కార్యక్రమాలలో విజయకీలాద్రి దివ్యక్షేత్ర వేద పండితులు, అర్చకులు, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, వేద విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment