![ఎన్నికల కోడ్‌కు మంగళం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07gntd405-604993_mr-1738982270-0.jpg.webp?itok=bo8if88o)
ఎన్నికల కోడ్‌కు మంగళం
● నిబంధనలకు విరుధ్ధంగా ‘ఆలపాటి’ నామినేషన్ ● కలెక్టరేట్‌కు భారీ సంఖ్యలో వచ్చిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు
లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏకంగా కూటమి పార్టీ జెండాలతో గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వారు తప్పా మిగిలిన వారు కలెక్టరేట్ గేటు బయట ఆవరణలోనే ఉండాలి. అయితే, అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యంగా జిల్లా కలెక్టరేట్‌లోకి పార్టీ శ్రేణులు లోపలికి వచ్చాయి. మరో వైపు పోలీసులు కూడా చూస్తూ నిలబడ్డారు. జిల్లా కలెక్టరేట్‌కు పనులపై వచ్చే ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఎట్టకేలకు రాజా నగరంలోని పలువురు పార్టీ శ్రేణులు, అభిమానుల నడుమ స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట గుంటూరు ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా కె.యస్. లక్ష్మణరావు ఈనెల 10న దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు శుక్రవారం ఎనిమిది మంది వేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెలుగు రాజాధికార సమితి పార్టీ నుంచి అనిల్‌కుమార్ జాలాది, ఇండిపెడెంట్లుగా బాలకృష్ణ మంత్రి, గంటా మమత, జూపూడి శ్యామ్ ప్రసాద్, కందుల వెంకటరావు, లగడపాటి వేణుగోపాల్, మూరకొండ చంద్రశేఖర్ నామినేషన్లను జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.నాగలక్ష్మికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment