పీఆర్‌ సీఈ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌ సీఈ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు

Published Sun, Oct 20 2024 1:20 AM | Last Updated on Sun, Oct 20 2024 1:20 AM

పీఆర్‌ సీఈ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు

హన్మకొండ : పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని ప్రస్తుత ఐనవోలు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాన్ని పంచాయతీరాజ్‌ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ శంకరయ్య, వరంగల్‌ అర్బన్‌ డిప్యూటీ సీఈఓ రవితో కలిసి జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య శనివారం పరిశీలించారు.ఈ నెల 23వ తేదీ వరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. స్థానికంగా మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం ఉండాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎంపీపీ కార్యాలయాన్ని ఐనవోలుకు తరలిస్తున్నారు. సోమవారం నుంచి ఐనవోలులో కార్యాలయం పని చేయనుంది. కాగా ఖాళీ అవుతున్న ఎంపీపీ భవనంలోకి పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని తరలించాలనే ఆలోచన అధికారులకు వచ్చింది. రాష్ట్రంలో నాలుగు చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాలను పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్‌లో రెండు, నిజామాబాద్‌, వరంగల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీంతో హనుమకొండలోని జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో తాత్కాలికంగా సీఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా ప్రస్తుతం అక్కడే కొనసాగుతుంది. అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్న ఈ కార్యాలయానికి పూర్తి స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.ఈ క్రమంలో ఖాళీ అవుతున్న మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు.

సీఈ కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్‌తో పాటు సూపరిండెంట్‌ ఇంజనీర్‌, ఇద్దరు డిప్యూటీ ఈఈలు, ఏడుగులు జూనియర్‌ ఇంజనీర్లు, ఒక సూపరిండెంట్‌, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యాలయ పరిధిలో వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, పెద్దపల్లి సర్కిల్‌లు ఉన్నాయి.

ఐనవోలు ఎంపీపీ కార్యాలయం పరిశీలన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement