సమాధానం చెప్పకుండా ఎదురుదాడి
మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్,
గండ్ర వెంకటరమణారెడ్డి
హన్మకొండ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ముందుగా దాస్యం మాట్లాడుతూ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ అమలుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగితే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేశారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తానని అహంకారంతో మాట్లాడుతున్నాడన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే..సీఎం రేవంత్ బుల్డోజర్ ఎక్కిస్తానని, ఏవేవో శాపనార్థాలు పెట్టాడని..ఇదేనా మీ సంస్కృతి అని ప్రశ్నించారు. గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..పత్తి ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా ఇప్పటివరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక్క కిలో పత్తి కొనిపించారా? అని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు పులి రజనీకాంత్, బొంగు అశోక్ యాదవ్, కుసుమ లక్ష్మీ నారాయణ, నయీముద్దీన్, కృష్ణ, జానకి రాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment