బాహుపేట క్రాస్‌రోడ్డులో చోరీ
హసన్‌పర్తి: ఎల్లాపురం శివారు బాహుపేట క్రాస్‌రోడ్డులోని ఓ ఇంటిలో చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదుతోపాటు 3.5 తులాల బంగారం మాయమైంది. బాధితుడి కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం సోమదేరవపల్లికి చెందన పోలు రాజేశ్ కలప వ్యాపారి. ఇటీవల హసన్‌పర్తి మండలం బాహుపేట క్రాస్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన బావమరిది అనారోగ్యానికి గురికావడంతో వారం రోజుల క్రితం రాజేశ్ దంపతులు బాహుపేటకు వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లగా బీరువా ధ్వంసమై ఉంది. అందులో ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈమేరకు బాధితుడు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, సంఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, కాజీపేట ఏీసీపీ తిరుమల్, హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు, ఎల్కతుర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ రమేశ్ సందర్శించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
రూ. 10 లక్షల నగదు,
3.5 తులాల బంగారం అపహరణ
హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment