గ్రూప్–3 పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
వరంగల్: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్–3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం గ్రూప్–3 పరీక్షల నిర్వహణ రీజినల్ కో–ఆర్డినేటర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో ప రీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించి అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడు తూ జిల్లాలో 10,919 మంది అభ్యర్థులకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32 మంది పరిశీలకులు, 82 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 28 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో టీజీ పీఎస్సీ రీజినల్ కో ఆర్డినేటర్ బత్తిని చంద్రమౌళి, డీసీపీ రవీందర్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీసీపీ (అడ్మిన్) రవి, ఏసీపీ నందిరాంనాయక్ పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్య శారద
Comments
Please login to add a commentAdd a comment