వైఎస్సార్ చొరవతో ఇంటర్నెట్ సేవలు
హన్మకొండ చౌరస్తా: దివంగత నేత వైఎస్సార్ చొరవతో రూ.5 కే గ్రంథాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైఎస్సార్ హయాంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించానని గుర్తు చేశారు. లైబ్రరీలో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న అభ్యర్థులు గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రంథాలయ సిబ్బంది వేతనాల్లో జాప్యం లేకుండా సమస్యల్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి శశిజాదేవి, లైబ్రేరియన్లు మల్సూర్, పురుషోత్తంరాజు, సామాజిక వేత్తలు నిమ్మల శ్రీనివాస్, సాగంటి మంజుల, జూనియర్ అసిస్టెంట్ సంతోశ్ పాల్గొన్నారు.
మార్చి నెలాఖరులోగా బ్రిడ్జి పనులు పూర్తి
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. కాజీపేటలో రూ.78 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన మెటీరియల్‌ను గురువారం వారు పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలీ, నాయకులు ఈవీ శ్రీనివాస్ రావు, అబుబక్కర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
ఘనంగా జాతీయ గ్రంథాలయ
వారోత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment