అధికారులు ఆపిన బాల్య వివాహాల కేసుల వివరాలు
బాల్యం వివాహ బంధంలో బందీ అవుతోంది.. మూడుముళ్లతో ముక్కుపచ్చలారని బాలికల జీవితాన్ని ముడిపెడుతున్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి చట్టాలు ఉన్నా.. అవగాహనా రాహిత్యంతో కొందరు.. ఆర్థిక సమస్యలతో మరికొందరు బాల్య వివాహాలు చేస్తూ వారి బంగారు భవిష్యత్‌ను బుగ్గి చేస్తున్నారు.
సాక్షి, వరంగల్ :
ఆధునిక సాంకేతికత ఎంతో పెరిగింది. సమాజంలో పెనుమార్పులు వచ్చాయి. అయినా బాల్యవివాహాలు ఆగడం లేదు. ఆడపిల్లలు చదువులో రాణిస్తూ అన్నిరంగాల్లో దూసుకుపోయి సత్తా చాటుతున్నా ఇంకా పలుచోట్ల బలవంతపు వివాహాలు చేస్తూ బలి చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ తరచూ బాల్యవివాహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో 2023 సంవత్సరం 106 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకోగా.. ఈ ఏడాది ఏకంగా 140 వరకు నిరోధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా వెలుగులోకి రానివి అనేకం ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 18 ఏళ్లలోపు బాలికలు 26.8 శాతం మంది, 21 ఏళ్లలోపు బాలురు 20.3 శాతం మంది బాల్యవివాహాల బారిన పడుతున్నట్లు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.
ఆ కుటుంబాల్లోనే ఎక్కువ..
తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయినప్పుడు బాలికలను భారంగా భావిస్తున్నారు. 14 నుంచి 18 ఏళ్లలోపు వారిని పెళ్లి పీటలెక్కిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అమ్మాయిలు బడికెళ్లి చదువుకుంటుండగానే మధ్యలో ఆపి మెడలో పసుపుతాడు వేసేందుకు పట్టుబడుతున్నారు. తండ్రి చనిపోయాడని, పేదరికం పట్టి పీడిస్తోందని, అందుకే అమ్మాయిల భారం దించేసుకోవాలని బాల్యవివాహాలు చేస్తున్నారు. ఇది నిరక్షరాస్యులైన కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని వచ్చిన కేసులను అధికారులు పరిశీలిస్తే తెలుస్తోంది. తమ కులంలో ఆడబిడ్డలకు త్వరగా పెళ్లి చేయడమే సంప్రదాయమని చెబుతూ మైనర్లుగా ఉన్నప్పుడు మనువు కానిచ్చేస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి.
పెరుగుతున్న బాల్య వివాహాలు
2023లో 106.. ఈ ఏడాది ఏకంగా 140
అధికారులు ఆపినవి ఇవే అయితే..
అనధికారికంగా అనేకం ఉన్నాయి
ఏటికేడు పెరుగుతుండడంతో
అధికారుల్లో ఆందోళన
తల్లిదండ్రుల్లో మార్పుతోనే
అరికట్టే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment