రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
వరంగల్: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో వరంగల్ జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో శనివారం సీఎం కప్ జిల్లాస్థాయి ముగింపు క్రీడా పోటీల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 6 వేల మంది క్రీడాకారులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని 31 ఈవెంట్లలో పాల్గొన్నారని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఖోఖో, కబడ్జీ, వాలీబాల్, ఫుట్‌బాల్, నెట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్ తదితర జిల్లాస్థాయి పోటీల విజేతలకు కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి, జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కై లాశ్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి ధన్‌రాజ్, అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిలాల్ పాల్గొన్నారు.
బాస్కెట్‌బాల్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లాస్థాయి సీఎం కప్ బాస్కెట్‌బాల్ ఎంపిక పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. అండర్–23 బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు కోచ్ ప్రశాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment