అంకెలతో ఆట.. సూత్రాలతో లెక్కల వేట
గణిత దినోత్సవం ఎలా వచ్చిందంటే..
ఈ చిత్రంలో గైడ్ టీచర్ జర్పుల రాజునాయక్‌తో పాటు ఉన్న విద్యార్థి జర్పుల చందునాయక్. శాయంపేట మండలం కాట్రపెల్లిలోని సీఎస్‌ఐ బీజేఎం పాఠశాలకు చెందిన ఇతను జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచాడు. ‘వృత్తం దాని భాగాలు దాని సబ్‌థీమ్ మేథమెటికల్ మోడలింగ్, కాంపిటీషన్ థింకింగ్’ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపియ్యాడు. ఒక ఫ్లైవుడ్ షీట్, రెండు డ్రాయింగ్ షీట్‌లు కొన్ని ఇనుప మొలలు, కొన్ని హెయిర్ బ్యాండ్‌లు, గమ్ తదితర వస్తువులతో ఈఎగ్జిబిట్ తయారు చేశారు. వృత్తాకారం అనేది మన నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఎగ్జిబిట్ తెలియజేస్తుంది. విద్యార్థుల్లో ప్లే వే మెథడ్ కూడా ఇందులో భాగమేనని ఇలా బోధన చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుందని విద్యార్థి చెబుతున్నాడు.
సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రాజెక్టులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శన.. గుర్తింపు
నేడు జాతీయ గణిత దినోత్సవం (రామానుజన్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment