ఉద్యోగులను మోసగించడానికే యూపీఎస్
రామన్నపేట : ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేయడానికి 2025, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) తీసుకొస్తోందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ అన్నారు. ఆదివారం వరంగల్‌లోని ఇస్లామియా కాలేజీ మైదానంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కందుల జీవన్ కుమార్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఆర్టికల్ 51 ప్రకారం పౌరులకు కంట్రిబ్యూషన్ లేని పెన్షన్ పొందడం హక్కు అన్నారు. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగికి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, డీఏ ఆధారిత సర్వీస్ పెన్షన్, కమ్యూటేషన్ సౌకర్యాలను కలిగి ఉంటుందన్నారు. అదే యూపీఎస్ విధానంలో ఉద్యోగి, ప్రభుత్వ నెల వారీ కాంట్రిబ్యూషన్ ద్వారా జమైన పెన్షన్ నిధిని ఎంపీఎస్ ట్రస్ట్‌కు బదిలీ చేస్తే గాని సర్వీస్ పెన్షన్ నిర్ణయం జరగదన్నారు. ఇది తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో రిటైర్డ్ అయిన హైకోర్టు జడ్జి, విశ్రాంతి న్యాయమూర్తులకు కేవలం రూ.6 నుంచి రూ.15 వేల పెన్షన్ మాత్రమే అందుతుందన్నారు. సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసేలా ఈ నూతన పెన్షన్ విధానం ఉందన్నారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఈడిగి నరేశ్‌గౌడ్, ఉపాధ్యక్షులు లింగమూర్తి, బుచ్చన్న, జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, అఫ్జల్, కొండా శ్రీనివాస్, లక్ష్మణమూర్తి, దిల్షాన్, రవికాంత్, నాగముని, లక్ష్మీకాంత్, తోటావిక్రమ్, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌సీపీఎస్‌ఈయూ
రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ
Comments
Please login to add a commentAdd a comment