కాళోజీ జీవితం..విశ్వవ్యాప్తం
నేడు ‘ప్రజాకవి కాళోజీ’ చిత్రం విడుదల
హన్మకొండ కల్చరల్ : చిన్నప్పటి నుంచి వెండితెరను ఏలాలనే ఆకాంక్ష.. ఆకాంక్ష మేరకే ఓ విశ్రాంత ఉద్యోగి సినిమా బాట పట్టారు. ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో స్థిరపడే అవకాశమున్నా ఆవైపు వెళ్లలేదు. అభిరుచితో సినిమా రంగం వైపు కదిలారు. పలు చిత్రాలు తీస్తూ తెలుగు ప్రజలను మెప్పిస్తున్నారు. పల్లెటూరు అందాలు, కుటుంబ బంధాలు, అనుబంధాలను మేళవిస్తూ సహజ దర్శక నిర్మాతగా చక్కటి సినిమాలకు ప్రాణం పోస్తున్నారు. ఆయననే డాక్టర్ ప్రభాకర్ జైనీ.
వెండి తెరపై జైనీ..
డాక్టర్ ప్రభాకర్ జైనీ జన్మ స్థలం వరంగల్. కమర్షియల్ ట్యాక్సెస్ అసిస్టెంట్ కమిషనర్‌గా రిటైర్డ్ అయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఉద్యోగం చేస్తూనే సినిమా రంగం వైపు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా అవకాశాలు రాలేదు. దీంతో తక్కువ బడ్జెట్‌లో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ‘జైనీ క్రియేషన్స్’ పేరుతో సినిమాలు చేయడం ప్రారంభించారు. తాను రచించిన 40 నవలలు, 250 కవితల నుంచి ప్రధాన అంశాలను తీసుకుని మూడు సినిమాలు తెరకెక్కించారు. ఈ సినిమాలను ప్రజలు ఆదరించారు. 2014లో తీసిన నవల ‘నా సినిమా సెన్సార్ అయిపోయిందోచ్!’కు నంది అవార్డు లభించింది. ప్రభుత్వం నుంచి అనేకమార్లు ప్రశంసలు పొందారు. కాగా, ప్రజాకవి కాళోజీ చిత్రం 2022లో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెన్సార్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.
నేడు ప్రజాకవి కాళోజీ చిత్రం విడుదల
స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ‘ప్రజాకవి కాళోజీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాత విజయలక్ష్మి జైనీ, కథ–మాటలు–స్క్రిన్‌ప్లే దర్శకతం ప్రభాకర్‌జైనీ వ్యవహరించారు. ఈ సినిమా తీసి ప్రజాకవి కాళోజీకి ప్రాణం పోశారు. ప్రేక్షకులకు వినోదం అందించడమే కాదు, సమాజానికి సందేశాన్నిచ్చే చక్కటి చిత్రం. సోమవారం ఉదయం ‘ప్రజాకవి కాళోజీ’ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఈనెల 29 వరకు ఉదయం ఆటలలో పాఠశాలల విద్యార్థుల కోసం వరంగల్‌లో రాధిక, జెమిని, హనుమకొండలోని అశోక థియేటర్‌లో ఉచితంగా ప్రదర్శించబడుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి.. డీఈఓకు పంపించారు.
డిసెంబర్ 29 వరకు మార్నింగ్ షో
విద్యార్థులకు ఉచితం
కాళోజీ స్ఫూర్తిని రగిలించేలా బయోపిక్
చైతన్యం చేయడమే నాలక్ష్యం: డైరెక్టర్ ప్రభాకర్ జైనీ
వారం రోజులు ఉచితం
మంచి చిత్రాలు తీయడమే లక్ష్యంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించా.. తక్కువ బడ్జెట్‌తో గ్రామీణ కళాకారులతో సినిమాను రూపొందించా. ‘ప్రజాకవి కాళోజీ’ చిత్రాన్ని వారం రోజుల పాటు ఉదయం ఆటలలో విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించాం.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–ప్రభాకర్ జైనీ,
‘ప్రజాకవి కాళోజీ’ చిత్రం దర్శక, నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment