కేయూ క్యాంపస్: కేయూలో బీపీఈడీ , ఎంబీఏ విద్యార్థుల మధ్య ఇటీవల వివాదం తలెత్తిన విషయం విధితమే. క్రీడామైదానంలో ఎంబీఏ విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా పలువురు బీపీఈడీ స్టూడెంట్స్ వచ్చి తాము ఆడుకోవాల్సిన గ్రౌండ్‌లోమీరెలా ఆడుతారని అడ్డుకుని వాగ్వావాదానికి దిగి కొట్టారని ఆరోపిస్తూ ఎంబీఏ విద్యార్థులు ఆందోళన చే సి రిజిస్ట్రార్ మల్లారెడ్డికి విన్నవించిన విషయం విధితమే. ఈ ఘట నపై విచారించడానికి కమిటీని నియమించినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఆదివారం తెలిపారు. చైర్మన్‌గా క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, సభ్యులుగా కామర్స్,బిజినెస్‌మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ అమరవేణి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ ఏటీబీటీప్రసాద్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డైరెక్టర్ నిరంజన్ శ్రీనివాస్ ఉన్నారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
కాజీపేట రూరల్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక కాజీపేటకు చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి బాలరాజు (56) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట జీఆర్పీ ఎస్సై టి.నాగరాజు కథనం ప్రకారం.. బాలరాజు కొంత కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వైఎస్సాఆర్ నగర్ కాలనీలో ఆటో డ్రైవర్..
కాజీపేట : కుటుంబ కలహాలతో కాజీపేట వైఎస్సాఆర్ నగర్ కాలనీలో ఆటోడ్రైవర్ అంగిడి రాజశేఖర్ (38) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం.. రాజశేఖర్ విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై నవీన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పత్తి చేనులో గంజాయి మొక్క
● సీడ్ కోసం పెంచుతున్నట్లు అంగీకారం
హసన్‌పర్తి: మండల పరిధి మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఓ పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆదివారం దాడులు చేశారు. గ్రామానికి చెందిన కొత్తూరు కిషన్ పత్తి చేనును పరిశీలించగా అందులో గంజాయి మొక్క లభించింది. కిషన్‌కు మూడెకరాల వ్యవసాయం భూమి ఉండగా.. ఎకరంలో పత్తి సాగు చేశాడు. అందులోని గంజాయి మొక్కను ఆకుల వాసనతో గుర్తించిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయి విత్తనాల కోసం మొక్కను పెంచుతున్నానని, విత్తనాలు వచ్చాక ఎండబెట్టి పంట సాగు చేయాలని నిర్ణయించినట్లు కిషన్ విచారణ సందర్భంగా చెప్పాడని పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు తెలిపారు. పంచనామా చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment