‘గిన్నిస్’ లోకి హనుమంతపురి..
● దేవస్థాన ఆవరణలో 963మందితో కోలాటం ప్రదర్శన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొప్పూర్ శివారులోని గద్దల బండపై వెలసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని గిన్నిస్ రికార్డు వరించింది. ఆదివారం ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా మీద కోలాటం నిర్వహించారు. ఈ కోలాటం గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. గతంలో 429 మందితో నిర్వహించగా.. ఈ సారి 963 మంది మహిళలతో నిర్వహించి రికార్డు సాధించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు భారత్ కోఆర్డినేటర్ వెంకటరమణరావు.. ఆలయ చైర్మన్ కాసం రమేశ్‌కు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ముఖ్య తిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ప్రతీ ఒక్కరిని సన్మార్గంలో నడిపించడానికి కోలాట ప్రదర్శన దోహదపడుందన్నారు. కాగా, హనుమంత్‌పురిని గిన్నిస్ రికార్డు వరించడంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వంగ రవీందర్, రాజమణి, సమ్మయ్య పాల్గొన్నారు.
కేయూ ఇయర్ వైజ్ స్కీం
● ఒక్కోపేపర్‌కు రూ.4వేల ఫీజు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల ఇయర్‌వైజ్ స్కీం విద్యార్థులకు బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల పరీక్షలు రాసుకునేందుకు ఫీజు చెల్లించేందుకు పరీక్షల విభాగం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఏ, బీబీఎం, బీకాం, బీఎస్సీ, బీఏ(ఎల్), బీసీఏ, బీ ఓకేషనల్ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల ఇయర్‌వైజ్ స్కీం విద్యార్థులు బ్యాక్ లాగ్ సబ్జెక్టుల పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని కేయూ పరీక్షల నియంత్రణా ధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, డాక్టర్ వెంకటయ్య తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.4 వేల ఫీజు చెల్లించాల్సింటుందని, అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 1 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా వివరాలకు క్యాంపస్‌లోని పరిపాలన భవనం అకడమిక్ బ్రాంచ్‌లో సంప్రదించాలన్నారు.
తోటి తెగ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రఘు
గీసుకొండ: గీసుకొండ మండలంలోని జాన్‌పాకలో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆది వాసీ తోటి తెగ సేవ సంఘం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా గుర్రం రఘు, గౌరవ అధ్యక్షుడిగా సోమ సాంబయ్య, ఉపాధ్యక్షులుగా ఆకుల రమేశ్, గుర్రం హరీశ్, సోయం వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా గుర్రం మధు, సహాయ కార్యదర్శులుగా షెడ్మాకి సదా నందం, గుర్రం అజయ్, కోశాధికారిగా ఆకుల యాదగిరి, ప్రచార కార్యదర్శులుగా గుర్రం రాజశేఖర్, గేడెం క్రాంతి, సోయం శరత్‌బాబు, మరో ఎనిమిది మందిని కార్యవర్గ సభ్యులు, సలహాదారులుగా ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment