అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
కాళోజీ సెంటర్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 122 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు సిఫార్సు చేశారు.
సర్వే త్వరగా పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు సేకరించిన ఇందిరమ్మ సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీఓ ఎం. విజయలక్ష్మి, డీఆర్‌డీఓ పీడీ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాం..
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్ల ద్వారా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి ఎరువుగా మార్చుతున్నామని వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం ఢిల్లీ నుంచి ఎస్‌బీఎం జాయింట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ పాల్గొని స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమం అమలును వివరించారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణిలో 122 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment