కాజీపేట అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కాజీపేట: అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిన కాజీపేటను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలనే ప్రయత్నాలకు ప్రజలు అండగా నిలవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని కడిపికొండ రైల్వే ఆర్వోబీ, సెయింట్ జోసఫ్ చర్చి వద్ద ఉన్న మోరీని గురువారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా నాయిని మాట్లాడుతూ.. వారం రోజుల్లో కడిపికొండ బ్రిడ్జిని మరమ్మతు చేయించాలని, రెండు నెలల్లో మోరీ సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. వరంగల్ నగరానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట పట్టణ చౌరస్తాను అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి రైల్వే జీఎంను కలిసి బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన స్థలం విషయం చర్చించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భావుసింగ్, కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ, మాజీ కార్పొరేటర్లు గుంటి కుమారస్వామి, ఎండీ అబుబక్కర్, సుంచు అశోక్, కాంగ్రెస్ నాయకులు ఎండీ అంకూస్, మానస, భరత్, అరూరి సాంబయ్య, ఇప్ప శ్రీకాంత్, షఫీ, అజ్గర్, ఎండీ రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment