షార్ట్ సర్క్యూట్‌తో పండ్ల దుకాణంలో మంటలు
● సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
కాజీపేట : కాజీపేట ప్రధాన రహదారిపై ఓ పండ్ల దుకాణంలో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో దుకాణంలోని ప్లాస్టిక్ ట్రేలు పూర్తిగా కాలిపోయాయి. మడికొండకు చెందిన పండ్ల వ్యాపారి జూల అశోక్.. కొక్కోండ ఉదయ్ కుమార్ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణంలో దాదాపు 50కి పైగా పండ్లు నిల్వ చేసే ప్లాస్టిక్ ట్రేలు ఉన్నాయి. విద్యుత్ వైర్ల నుంచి ఒక్కసారిగా నిప్పులు చెలరేగి ట్రేలపై పడడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో అశోక్ బయటకు పరిగెత్తుకొచ్చి హనుమకొండ ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇవ్వగా సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. పండ్ల దుకాణంపై భవనంలో ఉన్న స్టైలిష్ బట్టల దుకాణానికి పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఎస్సై లవన్‌కుమార్ ప్రమాదస్థలికి చేరుకుని సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో భవనంతో పాటు రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment