● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్
వరంగల్: ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తూ ఈనెల 20వ తేదీ నుంచి ప్రీ–ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడిఝెట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ విద్యార్థులకు సూచించారు. శనివారం వరంగల్ పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో అకడమిక్ రివ్యూ నిర్వహించారు. ఇంటర్‌బోర్డు రూపొందించిన అకడమిక్ కాలెండర్ ప్రకారం.. విద్యార్థులను వార్షిక సిలబస్ ప్రకారం సన్నద్ధం చేస్తూ.. ఈనెల 20 నుంచి 25 తేదీల్లో పూర్వ–వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం మూడు గంటల పరీక్ష, మధ్యాహ్నం వేళల్లో ‘అధ్యయన తరగతులు’ నిర్వహించాలని సూచించారు. విద్యా పరంగా వెనుకబడిన విద్యార్థులకు తగు తర్ఫీదునివ్వాలన్నారు. కళాశాలల్లో పర్యావరణ పరీక్షల రికార్డులు మరియు అంతర్గత పరీక్షల తీరుతెన్నులను పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లు తగు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రాజశేఖర్, కొలంబో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment