కామన్‌మెస్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్
● విద్యార్థులు మెస్‌కార్డు తీసుకురావాల్సిందే..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్‌మెస్‌లో విద్యార్థులకు శనివారం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ అమలుచేస్తున్నారు. ఉద యం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమయంలో విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విద్యార్థులు తమ వెంట మెస్‌కార్డును తీసుకొస్తే బయోమెట్రిక్‌లో సిబ్బంది స్కాన్ చేస్తారు. దీంతో నాన్‌బోర్డర్లకు మెస్‌లోకి ఇక అనుమతి ఉండబోదని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. రోజూ మెస్‌కార్డును తప్పనిసరిగా తీసుకుని రావాల్సి ఉంటుంది. సుమారు 13వందల మందికిపైగా విద్యార్థులకు కామన్ మెస్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇదిలాఉండగా ఈ బయోమెట్రిక్ పనితీరును కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ సీహెచ్. రాజ్‌కుమార్ పరిశీలించారు. మరో వారం రోజల్లో పద్మాక్షి మహిళా హాస్టల్ మెస్‌లో కూడా ఈ బయోమెట్రిక్ విధానం అమలుచేయాలనే యోచనలో ఉన్నారు. ఆ తరువాత కేయూ ఇంజనీరింగ్ హాస్టల్ కూడా అమలు చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment