ఏటూరునాగారం డిపోనకు నిధులు మంజూరు
హన్మకొండ: వరంగల్ రీజియన్‌లో మరో డిపో ఏర్పాటునకు తుదిరూపు దిద్దుకుంది. దీంతో రీజియన్‌లో బస్ డిపోల సంఖ్య పదికి చేరుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్ 3న ఏటూరునాగారంలో డిపో నిర్మాణానికి అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే నిధుల విషయంపై ఆ జీఓలో స్పష్టంగా పేర్కొనలేదు. తర్వాత ఆర్టీసీ యాజమాన్యం నుంచి డిపో నిర్మాణంపై పూర్తి స్థాయి డీపీఆర్ పంపాలని వరంగల్ రీజియన్‌కు ఆదేశాల రాగా ఏటూరునాగారం బస్ డిపో, ములుగు బస్ స్టేషన్ నిర్మాణంపై డీపీఆర్ తయారు రూపొందించి పంపారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ బస్ భవన్‌లో జరిగిన టీజీఎస్ ఆర్టీసీ బోర్డ్ మీటింగ్‌లో ఏటూరునాగారం బస్ డిపో మంజూరుకు నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. బస్ డిపో నిర్మాణానికి రూ.6.28 కోట్లు, ములుగు బస్ స్టేషన్ నిర్మాణానికి రూ.5.11 కోట్లు, మంగపేట బస్ స్టాండ్ నిర్మాణానికి రూ.51 లక్షలు, కాళేశ్వరం బస్ స్టేషన్ ఆధునీకరణకు రూ.3.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులను సంప్రదించగా తమకు కూడా సమాచారం తెలిసిందన్నారు. అయితే అధికారికంగా ఎలాంటి ఆర్డర్లు రాలేదని తెలిపారు. ప్రస్తుతం హనుమకొండ వరంగల్–2డిపోనకు చెందిన బస్సులు ఏటూరునాగారం చేరుకుని అక్కడి నుంచి వివిధ గ్రామాలకు రవాణ సేవలు అందిస్తున్నాయి. ఏటూరునాగారం డిపో ఏర్పాటుతో హనుమకొండ నుంచి ఏటూరునాగారం వరకు వెళ్లే బస్సుల ఇంధన ఖర్చులు ఆదాకానున్నాయి. స్థలం అందుబాటులో ఉండడంతో పనులు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశమున్నట్లు సమాచారం.
అభివృద్ధికి సహకరిస్తున్న
మంత్రులకు రుణపడి ఉంటా : మంత్రి సీతక్క
ఏటూరునాగారం: ములుగు జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు, మంగపేట బస్టాండ్, ఏటూరునాగారం బస్‌డిపో నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మోక్షం కలిగిందని తెలిపారు. తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పనులు చేపడుతామని తెలిపారు. కాగా, మంత్రి సీతక్క కృషితోనే ములుగు, మంగపేట బస్టాండ్ నిర్మాణానికి, ఏటూరునాగారం బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో పాటు నిధులు మంజూరు చేసిందని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు.
రూ.6.28 కోట్ల వ్యయంతో నిర్మాణం
ములుగు బస్ స్టేషన్‌కు
రూ.5.11 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment