నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఖిలా వరంగల్: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతగా ముగిసింది. నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 5,632 మందికి గాను 4,352( 88 శాతం) మంది హాజరై 1,280 మంది గైర్హాజరయ్యారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించిన పరీక్ష సజావుగా జరిగింది. 80 సీట్లకు 4352 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు పర్యవేక్షకురాలు, నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ తెలిపారు. హనుకొండ, వరంగల్ మట్టెవాడ, గిర్మాజీపేట, కాశిబుగ్గ, శంభునిపేట, రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్లు స్పెషల్ స్క్వాడ్ అధికారులుగా వ్యవహరించారు. విద్యార్థులు గంట మందే పరీక్ష హాల్‌లోకి ప్రవేశించారు. ఆయా పరీక్షల సూపరిండెంట్‌ంట్లు ఏర్పాట్లు చేశారు. కాగా, పరీక్ష ప్రశాంతంగా జరిగిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులుకు నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
వరంగల్: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం వరంగల్ ఆరెపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఏనుమాముల ఇన్‌స్పెక్టర్ ఎ.రాఘవేందర్ కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన గండ్రతి కనకలక్ష్మి(67), భూపతి సాంబలక్ష్మి(65) నగరంలో చీపుర్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈక్రమంలో చీపుర్ల కొనుగోలు నిమిత్తం కరీమాబాద్‌కు చెందిన పుదారి భీమయ్య ఆటోలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఆరెపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా హనుమకొండ నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు.. ఆటోను ఢీకొంది. ఈ క్రమంలో కనకలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, సాంబలక్ష్మి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్ భీమయ్య చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతురాలు కనకలక్ష్మి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాజబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుఇన్‌స్పెక్టర్ ఎ.రాఘవేందర్ తెలిపారు.
గడువులోగా పనులు పూర్తి చేయండి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
వరంగల్: జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పనులు పూర్తయిన ఎంబీలతో పాటు, పూర్తయిన పనులకు ముందు, తర్వాత ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేసి ఫొటోలతో పాటు ఎంబీలను అడ్మినిస్ట్రేషన్ మంజూరుకు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1,208 పనులు మంజూరవ్వగా.. 199 పనులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, పీఆర్ ఈఈ ఇజ్జగిరి, అమ్మ ఆదర్శ పాఠశాలల ప్లానింగ్ కో–ఆర్డి నేటర్ విజయ్‌కుమార్, ఎంఈఓలు, ఏఈలు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాంల పరిశీలన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా గోదాంలను కలెక్ట ర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి శనివారం పరిశీలించారు.
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహణ
● 5,632 మందికి 4,352 మంది విద్యార్థులు హాజరు
● 1,280 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment