సంగీతంతో మానసిక ప్రశాంతత
హన్మకొండ కల్చరల్ : సంగీతంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ విద్యారణ్య అర్షధర్మ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో సద్గురు శ్రీత్యాగరాజ స్వామివారి 178వ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని సామా జగన్మోహన్ స్మారక భవనంలో సంస్థ అధ్యక్షుడు నకిరేకంటి రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి విశిష్టఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ఆరాధనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగీత ఉపాధ్యాయుడు లక్ష్మణాచారి త్యాగరాజస్వామి వేషధారణలో అలరించారు. కార్యక్రమంలో వరంగల్ సీపీ అంబర్‌కిశోర్‌ఝా, అజరా హాస్పిటల్ చైర్మన్ అప్పాల సుధాకర్, సంగీత విద్వాంసులు తిరుపతయ్య, ప్రముఖ ఫిజిషీయన్ డాక్టర్ బి. వివసుబ్రహ్మణ్యం, ఆగమ సామ్రాట్ భద్రకాళి శేషు, లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌కుమార్, వర్ధమాన గాయకులు జొన్నలగడ్డ సత్యశ్రీరాం, రాంపల్లి కౌస్తుభ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment