పారాలీగల్ వలంటీర్లకు శిక్షణ
వరంగల్ లీగల్ : హనుమకొండ కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం పారాలీగల్ వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ముఖ్యఅతిథులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు రమేశ్‌బాబు, నిర్మల గీతాంబ హాజరై వలంటీర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కమిటీ సభ్యులు తమ బాధ్యతలు, సూచనలు, సలహాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ రెండు జిల్లాల కార్యదర్శులు క్షమాదేశ్ పాండే, ఎం.సాయికుమార్, సివిల్ జడ్జి ఉపేందర్, సుభాష్, న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment