హన్మకొండ: ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 20 నుంచి 24 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ట్రాన్స్ కో వరంగల్ జోన్ చైర్మన్ బి.ఐలయ్య, కన్వీనర్లు కె.వెంకటేశ్, కె.రాజన్న తెలిపారు. ఆర్టిజన్లను సంస్థ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈ దీక్షలు చేపట్టనున్నట్లు వారు ఒక ప్రకటనలో వివరించారు. యాజమాన్యం ఇప్పటికై నా తమ న్యాయమైన డిమాండ్‌ను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిజన్లు దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment