30 సార్లు ఫిర్యాదు చేశా..
గ్రామంలోని 194 సర్వే నంబర్లో నాకు వారసత్వంగా వచ్చిన ఎకరం 24 గుంటల భూమి ఉంది. నేను కాస్తు చేసుకుంటున్న ఆ భూమికి సంబంధించి సాదాబైనామా ద్వారా తహసీల్దార్ నుంచి తెలంగాణ పాస్ పుస్తకం పొందాను. ప్రస్తుతం భూమి వేరేవారి పేరును చూపుతున్నది. కంప్యూటరీకరణ చేసే సమయంలో భూమి వేరేవారి పేరున చేశారు. కాగితాలు సక్రమంగా లేవని పాస్ పుస్తకం ఇవ్వడంలేదు. 2020 ఫిబ్రవరి నుంచి ధరణిలో ఫిర్యాదు చేసి కలెక్టరేట్‌కు తిరుగుతున్నాను. న్యాయం చేయాలని నాలుగేళ్లుగా ప్రజావాణిలో 30 సార్లు ఫిర్యాదు చేశా. ఇప్పటికీ అధికారులు సమస్యలకు పరిష్కారం చూపలేదు.
– కట్కూరి రాజు, ఐనవోలు మండలం
Comments
Please login to add a commentAdd a comment