ఘనంగా రబ్బానీ ఉర్సు
ఖిలా వరంగల్ : కరీమాబాద్‌లోని హజ్రత్ మాషుఖ్ రబ్బానీ (రహమతుల్లా ఆలై) దర్గాలో ఉర్సు ఉత్సవాలు గురువారం రెండో రోజు ఘనంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతులు సయ్యద్ షా హైదర్ హిలాల్‌యొద్దీన్ ఖాద్రీ (నవీద్‌బాబా), సయ్యద్ అలీషా ఖాద్రీ (ఉబేద్‌బాబా) ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మతాలకతీతంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ట్రైసిటీకి చెందిన లక్షలాది మంది భక్తులు ఉర్సు ఉత్సవాలకు తరలివస్తున్నారు.దీంతో దర్గా ప్రాంగణం జనంతో కిటకిటలాడుతోంది. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఖురాన్ పఠనంతోపాటు బెంగళూరుకు చెందిన ముస్లింలు ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు దర్గా ఎదుట ఫకీర్ల ప్రత్యేక విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి, ముస్లింలు ఎంఏ జబ్బార్, చంద్‌పాషా, గఫార్, దస్తగిరి, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం నేతృత్వంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు.
ఖురాన్‌ను పఠించిన ముస్లింలు
మతాలకతీతంగా దర్గాను
దర్శించుకున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment