వివాహేతర సంబంధంతోనే వ్యక్తి హత్య
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన హత్య కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం సుబేదారి పీఎస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మడికొండకు చెందిన నిందితుడు ఏనుగు వెంకటేశ్వర్లు, మాచర్ల రాజుకుమార్(42) ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మడికొండకు చెందిన ఓ మహిళతో ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు.. రాజుకుమార్‌ను ఎలాగైనా చంపాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11.40 గంటలకు రాజుకుమార్ తన ఆటోలో హనుమకొండ నుంచి మడికొండకు వెళ్తున్నాడు. నిందితుడు వెంకటేశ్వర్లు అదాలత్‌లోని డీమార్ట్ ఎదురుగా రాజుకుమార్‌ను అడ్డగించి గొడవ పడి కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. సదరు మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరి మధ్య వారం క్రితం గొడవ జరిగింది. దీంతో రాజ్‌కుమార్‌ను ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్న నిందితుడు వెంకటేశ్వర్లు.. అదును కోసం ఎదురు చూసి రాజ్‌కుమార్‌ను హత్య చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాఽధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిందితుడు ఆటో డ్రైవర్
వెంకటేశ్వర్లు అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment