అశోక్‌కు గిడుగు జాతీయ పురస్కారం
కాళోజీ సెంటర్: వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పోగు అశోక్‌కు గిడుగు రామ్మూర్తి పంతులు వర్ధంతి వేడుకల సందర్భంగా ‘గిడుగు జాతీయ పురస్కారం’ లభించింది. బుధవారం హైదరాబాద్‌లోని సందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి, సేవా కార్యక్రమాలు చేసిన వారికి గిడుగు రామ్ముర్తి పంతులు ఫౌండేషన్ వారు జాతీయ పురస్కారాలు అందించారు. అందులో భాగంగా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తునే సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్‌గా తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తునందుకు ఈ పురస్కారం అందజేసినటఉల అశోక్ తెలిపారు. ఈసందర్భంగా ఎంఈఓ శ్రీధర్, స్కూల్ ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రమేశ్, తోటి ఉపాధ్యాయులు అతడిని అభినందించారు.
పీహెచ్‌డీ అడ్మిషన్
కల్పించాలని బైఠాయింపు
● పెట్రోల్ క్యాన్‌తో నిరసన
కేయూ క్యాంపస్: తమకు పీహెచ్‌డీ అడ్మిషన్ కల్పించాలని ఇద్దరు అభ్యర్థులు కాకతీయ యూనివర్సిటీలో వీసీ చాంబర్‌లో బైఠాయించారు. పెట్రోల్‌తోకూడిన క్యాన్ పట్టుకొచ్చి నిరసన తెలిపారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి కథనం ప్రకారం.. ఇద్దరు అభ్యర్థులు మంద నరేశ్, అనిల్ గురువారం వీసీ చాంబర్‌కు వచ్చి వీసీ ప్రతాప్‌రెడితో తమకు పీహెచ్‌డీ అడ్మిషన్ కల్పించాలని కోరారు. అయితే తాను వీసీగా బాధ్యతలు చేపట్ట కముందే పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిందని, ఇప్పుడు తన చేతిలో లేదని స్పష్టం చేశారు. అనంతరం వీసీ క్యాంపస్‌లోని లాడ్జ్‌కు వెళ్లిపోయారు. దీంతో నరేశ్, అనిల్ పెట్రోల్‌తోకూడిన క్యాన్‌తో వీసీ చాంబర్‌లోకి వెళ్లి బైఠాయించారు. దీనిపై రిజిస్ట్రార్ మల్లారెడ్డి.. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆ ఇద్దరిని అదపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, కొంతకాలంగా తరుచూ పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలని అడ్మినిస్టేషన్ పరంగా తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని నరేశ్, అనిల్‌పై పోలీసులకు పిర్యాదు చేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment