మానవ అక్రమ రవాణాను నిర్మూలిద్దాం
హన్మకొండ: మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన కోసం అందరం కలిసి పని చేద్దామని హనుమకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాథోడ్ రమేశ్ పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని ‘అసుంత’ భవన్‌లో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలనపై వర్క్‌షాపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాథోడ్ రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మూలాలు, కారణాలను తెలుసుకుంటూ సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకన్న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మానవ అక్రమరవాణా తీరుతెన్నులు, నిర్మూలనపై వివరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సంస్థ డైరక్టర్ సిస్టర్ సహాయ, హనుమకొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్ చందర్ రావు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధి మేరక మణి, మాజీ సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ కె.అనితారెడ్డి, చైర్మన్ మండల పరశురాములు, హనుమకొండ జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్
Comments
Please login to add a commentAdd a comment