యూపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిందే
హన్మకొండ అర్బన్ : కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని పీఎఫ్ ఆర్డీఏ ద్వారా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాబోతున్న మరో మోసపూరిత పథకమే యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్) అని, దీనిని వ్యతిరేకించాలంటే చట్టసభల్లో పోరాడాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యాలయంలో యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందుల జీవన్ కుమార్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, విశిష్ట అతిథిగా సీపీఎస్ వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి కొలిపాక వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న కొలిపాక వెంకటస్వామిని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పకుండా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అనంతరం సంఘం హనుమకొండ జిల్లా నూతన సంవత్సర –2025 క్యాలెండర్, సీపీఎస్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మేనిఫెస్టోను అతిథులు ఆవిష్కరించారు. టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చన్న, రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్, జిల్లా నాయకులు ఆవునూరి రవి, నాగముని, లక్ష్మణ మూర్తి, రవీందర్‌రెడ్డి, హరికుమార్, రాజు, సరళారాణి, ఉమారాణి, ఆనంద్ కుమార్, అక్బర్, రఘుపతి, శ్రీకాంత్, శంకర్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌సీపీఎస్‌ఈయూ
రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ
Comments
Please login to add a commentAdd a comment