![భద్రక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/08022025-wud_tab-07_subgroupimage_1887011040_mr-1738980761-0.jpg.webp?itok=MbOffLnr)
భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి మాఢవీధుల నిర్మాణ పనులు, దేవాలయ అభివృద్ధి పనుల్ని ‘కుడా’ అధికారులు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు పరిశీలించారు. ఈమేరకు గురువారం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అధికారులను ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించనున్న అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఈసందర్భంగా మాఢవీధుల ప్లాన్ ప్రకారం ఆలయ పరిసరాల్ని పరిశీలించారు..
పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీలో
ఐదుగురికి చోటు
విద్యారణ్యపురి: భద్రాచలంలో ఈనెల 4, 5 తేదీల్లో పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఐదుగురికి చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా (కేయూ రీసెర్చ్ స్కాలర్) బి.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా అలువాల నరేశ్ (ఎమ్మెస్సీ సైకాలజీ కేయూ), కావ్య కేయూ, బొట్ల రాకేశ్ (మహబూబాబాద్), పి.అనూష (కేయూ ) ఎన్నికయ్యారు.
జస్టిస్ మౌసమి
భట్టాచార్యకు ఆహ్వానం
వరంగల్ లీగల్: ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జి జస్టిస్ మౌసమి భట్టాచార్యను ఉభయ జిల్లాల న్యాయవాద సంఘ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈనెల 16న (ఆదివారం) జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మాణమైన న్యాయవాదుల కార్ పార్కింగ్ షెడ్లు, హనుమకొండ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వా నించారు. అదేవిధంగా నూతనంగా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ యార రేణుక, జస్టిస్ ఈద తిరుమలాదేవి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావును మర్యాద పూర్వకంగా కలిసి వరంగల్ జిల్లాకు రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాతంగి రమేశ్‌బాబు, లడే రమేశ్, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ కోశాధికారి కె.శంకరాచారి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
![భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07hmkd304-330157_mr-1738980761-1.jpg)
భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
![భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07wgl251-330092_mr-1738980761-2.jpg)
భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment